కేటీఆర్..ఆ పదేళ్లు నువ్వు మగాడివి కాదా..?

సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే కాంగ్రెస్ లో చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న కేటీఆర్ సవాల్ పైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. గత పదేళ్లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు వారితో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్ మగాళ్లు కాదా అని ఆయన ఎద్దేవా వేశారు. ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారని ,వారితో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులపైన కేటీఆర్ ఎంత గింజుకున్నా తెలంగాణ ప్రజలు పట్టించుకోరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొగోడు, దమ్మునోడు కాబట్టే కేసీఆర్ ను ఓడించి ఫామ్ హౌస్ కు పంపించాడని అద్దంకి వ్యాఖ్యానించారు.