చంద్రబాబుకు సెక్యూరిటీ డబుల్
1 min readఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతను పెంచారు. ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలను ద్రుష్టిలో ఉంచుకొని ఎన్ఎస్జీ తెలుగుదేశం అధినేత సెక్యూరిటీని సమీక్షించింది. ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేస్తు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబునాయుడు వెంట నిత్యం ఆరుగురు ఎన్ఎస్జీ సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. ఈ సంఖ్యను 12కు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఎన్ఎస్జీ ఐజీ స్వయంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాయలంతో పాటు చంద్రబాబు నివాసాన్ని పరిశీలించి సెక్యూరిటీ పైన పలు సూచనలు చేశారు.