పొంగులేటి కూతురు రిసెప్షన్ కి మంత్రి కేటీఆర్

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగింది. వధూవరులు సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డిలను పలువురు రాజకీయ ప్రముఖులు ఆశ్వీరధించారు. మంత్రి కేటీఆర్ సతీసతమేతంగా కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు రిసెప్షన్ లో పాల్గొన్నారు. అంతకు ముందు ఖమ్మంలో కార్యకర్తలు,అభిమానుల కోసం పొంగులేటి భారీ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు మూడు లక్షల మంది పాల్గొన్నారు. పొంగులేటి ఈ రిసెప్షన్ కోసం 250 కోట్ల ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

