కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ
1 min readతెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ రేవంత్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న విభేదాలకు తెర దించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్టీ ఐక్యత కోసం రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగారు. మునుగోడు సభలో కోమటిరెడ్డి పైన అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపైన రేవంత్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డికి ఏకంగా క్షమాపణ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహారించిన కోమటిరెడ్డిపైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అద్దంకి దయాకర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డికి ఆయన సూచించారు. హోంగార్డు, ఐపిఎస్ అంటు ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్లను కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణపైన ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సింది.