బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ కర్

అందరని అంచనాలు తలకిందులు చేస్తు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఎన్డీఎ తరుపున బరిలోకి దిగుతారు. రాజస్తాన్ కు చెందిన ధన్ కర్ దాదాపు ఇరవై యేళ్లు బీజేపీలో పనిచేశారు. లాయర్ కూడా అయిన జగదీప్ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరో సారి అవకాశం ఇస్తారని భావించినప్పటికి ప్రధాని మోదీ మాత్రం ధన్ కర్ వైపు మొగ్గు చూపించారు.