దగ్గుబాటిని పరామర్శించిన చంద్రబాబునాయుడు
1 min readమాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన గుండె నాళాలు పూడుకుపోవడంతో డాక్టర్లు రెండు స్టంట్స్ వేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. షటిల్ ఆడుతున్న సమయంలో గుండెలో నొప్పి రావడంతో దగ్గుబాటిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షల్లో గుండె నాళాలు పూడుకుపోయినట్లు తేలడంతో వెంటనే స్టంట్లు వేశారు. దగ్గుబాటిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆప్పత్రిలో పరామర్శించారు.