చంచల్ గూడా జైలుకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చంచల్ గూడా జైలులో ఉన్న ఎన్ఎస్ యుఐ కార్యకర్తలను కలిశారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన జైలులో ములాఖత్ అయ్యారు. ఎన్ ఎస్ యుఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ తో పాటు కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధైర్యం చెప్పారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు వారితో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపైన నిరసన తెలిపిన ఎన్ఎస్ యుఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ లో ఉన్నారు.