విహెచ్ ఇంటిపైన దాడి
1 min readకాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాసంపైన దాడి చేసింది. గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటిపైన రాళ్లు విసిరారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన విహెచ్ కారు అద్దాలను పగలకొట్టారు. రాత్రి సమయంలో జరగడంలో దాడి చేసింది ఎవరన్నది తెలియరాలేదు. దాడి ఘటనపైన అంబర్ పేట పోలీసులకు విహెచ్ ఫిర్యాదు చేశారు. తన ఇంటి పైన దాడి చేసింది ఎవరో ప్రభుత్వమే విచారణ జరిపి తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైపు విహెచ్ ఇంటి మీద దాడిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విహెచ్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు భద్రత పెంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.