బీజేపీలోకి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
1 min read
టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. బిక్షమయ్యతో పాటు ఆయన అనుచరులు కొందరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గత కొంత కాలంగా టీఆర్ఎస్ నాయకత్వంపైన అసంత్రుప్తితో ఉన్నారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆవేదనతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన బిక్షమయ్య ఆ తర్వాత రెండు సార్లు ఆలేరులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేారారు. ఎమ్మెల్సీ పదవి ఆశించిన ఆయనకు సిఎం కేసీఆర్ నుంచి మొండి చేయి ఎదురైంది. ఆలేరులో కాంగ్రెస్ తరుపున బీర్ల అయిలయ్య యాదవ్ ఉండటంతో ఆ పార్టీలో స్థానం లేకుండా పోయింది. దీంతో బిక్షమయ్య బీజేపీ గూటికి చేరాల్సి వచ్చింది.