రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన భట్టి విక్రమార్క
1 min read
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క షాక్ ఇచ్చారు. రాష్ట్ర మొత్తం భారీ పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్న రేవంత్ కి భట్టి పోటీకి వస్తున్నారు. తానూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని సిఎల్పీ నేత ప్రకటించారు. అయితే ఒంటరిగానా లేక పీసీసీ చీఫ్ తో కలిసి నడుస్తారా అన్న దానిపైన ఆయన స్పష్టత ఇవ్వలేదు. సొంత నియోజకవర్గం మధిరలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే తొలివిడత పూర్తి చేసిన ఆయన ఈ నెల 25 నుంచి మలి విడత కార్యక్రమానికి ఫ్లాన్ చేసుకుంటున్నారు. మరో వైపు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని పదే పదే చెపుతున్నారు. 10 నెలల పాటు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరుతు కొల్లాపూర్ సభలో తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే భట్టి ప్రకటన కాంగ్రెస్ లో మరో చర్చకు దారి తీసింది.