ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ

1 min read
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపైన ఆయన ప్రధానికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణపైన త్వరలో ద్రుష్టి సారిస్తానని మోదీ తనతో చెప్పినట్లుగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. అపాయింట్ మెంట్ కోరిన అరగంటలో ఇచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారని కోమటిరెడ్డి వివరించారు. మూసి నదిని నమామి గంగ తరహాలో ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ నిర్మాణం పై చర్చించానని,ఏప్రిల్ లో ప్రారభించాలని మోదీకి సూచించినట్లు కోమటిరెడ్డి వివరించారు.నల్గొండ మల్లెపల్లి,భువనగిరి చిట్యాల రోడ్డు గురించి ప్రధానితో చర్చించానని ఆయన తెలిపారు. తెలంగాణలో పెద్ద మైనింగ్ కుంభకోణం జరగబోతుందని, సింగరేణికి అలాట్ చేసిన మైన్ తో 50 వేల కోట్ల కుంభకోణం జరగబోతుందని మోదీకి వివరించామని కోమటిరెడ్డి చెప్పారు.
May be an image of 2 people and people standing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn