ఝార్ఖండ్ కు కేసీఆర్
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ రోజు ఝార్ఖండ్ వెళ్లనున్నారు. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అటు నుంచే ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్తారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రెంట్ ఏర్పాటుపైన సోరేన్ తో కేసీఆర్ చర్చించే అవకాశముంది. గాల్వన్ ఘటనలో చనిపోయిన ఇద్దరు ఝార్ఖండ్ అమర జవాన్లకు కేసీఆర్ సాయాన్ని అంజేయనున్నారు. ఈ సంఘటనలో చనిపోయిన 19 మంది జవాన్లకు 10 లక్షల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం సాయాన్ని ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాలకు చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆర్థిక సహాయం అందించనున్నారు.