మంత్రి అప్పలరాజుకు అవమానం

ఎపి మంత్రి సిదిరి అప్పలరాజు శంషాబాద్ ముచ్చింతల్ లో హల్చల్ చేశారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనతో పాటు అనుచరులను లోపలికి అనుమతించాలని డ్యూటీలో సిఐకి సూచించారు. అయితే మంత్రిని మాత్రమే అనుమతిస్తానని సిఐ తేల్చి చెప్పడంతో వివాదం మొదలైంది. మంత్రి అప్పలరాజు సిఐ పైన దూషణలకు దిగారు. అయినప్పటికి పోలీసులు వదలకపోవడంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు.