కాంగ్రెస్ లోకి సోనూసూద్ చెల్లెలు

ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ చెల్లెలు మాళ్విక సూద్ కాంగ్రెస్ లో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి ,పీసీసీ చీఫ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చెల్లెలు వెంట సోనూసూద్ కూడా ఉండటం విశేషం. మాళ్విక సూద్ కాంగ్రెస్ తరుపున త్వరలో జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. సోనూసూద్ కుటుంబం కాంగ్రెస్ లో చేరడం పంజాబ్ లో ఆ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇటీవల సోనూసూద్ పైన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారన్న కారణంతోనే ఈ దాడులు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి.