బీపీ పెరిగే దాడి చేశారు
1 min readతెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపైన దాడి మీద ఎపి సిఎం వైఎస్ జగన్ స్పందించారు. టీడీపీ నాయకుల బూతు భాషను తట్టుకోలేకనే తనను అభిమానించే వారు బీపీ పెరిగి దాడి చేశారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలే వైషమ్యాలను పెంచి పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ప్రభుత్వంపైన దుష్పచారం చేస్తున్నాయని జగన్ ఆరోపించారు.