ప్రధాని మోదీకి కోవిడ్ వ్యాక్సిన్
1 min readభారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు, శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దేశ వ్యాప్తంగా పెద్ద వయసు వాళ్లకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.