తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా
1 min readతెలంగాణలో మరో పార్టీ ఖాయమైంది. ఎపీ సి.ఎం వై.ఎస్ జగన్ సోదరి షర్మిల పార్టీ పెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ వైసీపీ పేరుతో పార్టీ ఏర్పాటు కానున్నది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ ఏర్పాటుపైన ఆమె నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. అన్ని జిల్లాల నాయకులతో వరసగా చర్చలుంటాయని షర్మిల తెలిపారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత పార్టీ ఏర్పాటుపైన నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీనే కంటిన్యూ చేయాలా లేక కొత్త పార్టీ తీసుకురావాలా అన్నది కూడా చూస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో పాదయాత్ర చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో రైతులు,విద్యార్థులు ఎవరూ సంతోషంగా లేరని షర్మిల వ్యాఖ్యానించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ సరిగా అమలు కావడం లేదన్నారు. ఎపీలో జగన్ తన పని తాను చేసుకుంటున్నాడని, అందుకే తెలంగాణపైన ద్రుష్టి సారించినట్లు షర్మిల స్పష్టం చేశారు.