పది రోజుల పాటు పాదయాత్ర
1 min read
రేవంత్ రెడ్డి పాదయాత్ర తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఊహించని విధంగా పాదయాత్ర ప్రారంభించిన ఆయన రైతుల కోసం గళం విప్పారు. అచ్చంపేటలో రైతు దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అక్కడి నుంచే పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించి అప్పటికప్పుడే ప్రారంభించారు. మొదటి రోజు 11కిలోమీటర్లు నడిచి తన చిత్తశుద్దిని నిరూపించుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ లోని సరూర్ నగర్ వరకు ఈ యాత్ర 10 రోజు పాటు జరగనున్నట్లు సమాచారం. సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రోజుెకు పది కిలోమీటర్ల చొప్పున నడుస్తు ఒక సభ లో పాల్గొనున్నారు. రేవంత్ కు సంఘీభావం తెలియజేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తరలిరానున్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారా లేక అడ్డుకుంటారా అన్నది చూడాలి. ఇదే సమయంలో ఆయన పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్ల నుంచి మద్దతు ఉంటుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.