కార్యకర్త దంపతులకు చంద్రబాబు ఆశ్వీరాదం
1 min read
తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలకు ఎంత విలువ ఇస్తుందో ఈ సందర్భం చూస్తే తెలిసిపోతుంది. కార్యకర్తల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆ పార్టీ వారి కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటోంది. కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. తాజాగా ఆయన చిత్తూరు జిల్లాలో పార్టీకి చెందిన వీరాభిమాని ఆశను నేరవేర్చారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలానికి చెందిన ఆల్బర్ట్ తెలుగుదేశం కార్యకర్త. తన పెళ్లి చంద్రబాబునాయుడు సమక్షంలో జరగాలని ఆశపడ్డారు. నియోజకవర్గ ఇంఛార్జి గాలి భాను ప్రకాష్ కు తన మనసులోని మాటను చెప్పారు.ఈ విషయాన్ని ఆయన అధినేత చంద్రబాబునాయుడు ద్రుష్టికి తీసుకెళ్లారు. కరోనా నేపథ్యంలో చిత్తూరు వెళ్లలేకపోయిన ఆయన జూమ్ ద్వారా వధూవరులను ఆశ్వీరధించారు. అధినేత ఆశీర్వాదం అందడంతో కొత్త దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


