రసమయి బాలకిషన్ చేపల చెరువు కథ
1 min read
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఏదో ఒక వివాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పలు సార్లు వార్తల్లోకి ఎక్కిన ఆయన మరో సారి కాంగ్రెస్ పార్టీకి చిక్కారు. తన ఫామ్ హౌజ్ కు రసమయి బాలకిషన్ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాజశేఖర్ రెడ్డి బయటపెట్టారు. కాల్వకు పెద్ద ఎత్తున గండి పెట్టి ఇతర రైతుల పొలాల నుంచి ఫామ్ హౌజ్ కు నీటిని తీసుకెళ్తున్నారని ఆయన వీడియోలో చూపించారు.