*ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపే భూమిపూజ*

• హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రేపు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
• కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నారు.
• హైదరాబాద్ పరిధిలో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
• పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో సొంతింటి కలను నెరవేర్చేందుకు లక్ష ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మిస్తోంది.
• CURE పరిధిలో 12 వేల ఫ్లాట్లతో పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో 18 చోట్ల 7,340 ఫ్లాట్ల నిర్మాణం చేపడుతుంది.
• హైదరాబాద్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని నిర్మించనున్నారు.
• రూ. 807.40 కోట్లతో వీటి నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
• ఒక్కో ఇందిరమ్మ ఇల్లు.. 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంటుంది.
• ఒక్కో ఫ్లాట్‌కు ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీ అందిస్తుంది. ఒక్కో ఫ్లాట్‌కు లబ్ధిదారుడి వాటా రూ. 6 లక్షలు ఉంటుంది.
• రూ.6 లక్షల వరకు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.
• దరఖాస్తుదారుడికి CURE పరిధిలో సొంత ఇల్లు, ప్లాట్ లేదా ఫ్లాట్ ఉండకూడదు. ఒక కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు.
• దరఖాస్తుదారులు తాము నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాలి.
• దరఖాస్తు సమయంలో ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. దరఖాస్తు ఫీజు రూ. 100. టోకెన్ అడ్వాన్స్ రూ. 10 వేలు చెల్లించాలి. ఫ్లాట్ అలాట్ కాకపోతే ఈ డబ్బు తిరిగి చెల్లిస్తారు. ఫ్లాట్ కేటాయింపు జరిగితే ఆ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు.
• మీసేవ కేంద్రాలు, meeseva.telangana.gov.in, మీ సేవ వాట్సాప్ సర్వీస్ 8096958096 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
• ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15, 2026 చివరి తేదీ. అర్హతలను పరిశీలించిన అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తారు.
• ఫ్లాట్ల కేటాయింపుల్లో ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, క్లాస్-4, పారిశుధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50 శాతం ఫ్లాట్లు జనరల్ కేటగిరీకి కేటాయిస్తారు. • అన్ని కేటగిరీలో 30 శాతం ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు.
• ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో రూ. 1 లక్ష, ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ. 2 లక్షలు, ఫినిషింగ్ దశలో మరో రూ. 2 లక్షలు, మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ అప్పగించే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
• ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్న కేపీహెచ్‌బీ కాలనీలో 480 ఇందిరమ్మ ఇండ్లు ఫ్లాట్ల నిర్మాణం ప్రతిపాదించారు.
• మల్కాజిగిరి కౌకూర్‌లో, శేరిలింగంపల్లి రాయదుర్గంలో, మహేశ్వరం జల్పల్లిలో, నాంపల్లిలో రెడ్‌హిల్స్‌లో, నీలోఫర్ సైట్లో నిర్మించనున్నారు. సనత్‌నగర్ పాటిగడ్డ, మలక్‌పేట గడ్డిఅన్నారం, ఇబ్రహీంపట్నం బండ్లగూడ, మేడ్చల్ పోచారం, రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి, కుత్బుల్లాపూర్ గాజులరామారం, ఖైరతాబాద్ పరిధిలో హకీంపేట్ దర్గా వద్ద, జూబ్లీహిల్స్‌లో, అంబర్‌పేట సిటీ పోలీస్ లైన్స్‌లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్‌పల్లిలో, కార్వాన్ కుల్సుంపురా పోలీస్ క్వార్టర్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మించనున్నారు.
