స్నేహం కోసం నిల‌బ‌డ్డ రేవంత్ రెడ్డి

స్నేహమంటే ఇదేరా.. రేవంత్, వేం నరేందర్ విడదీయరాని అనుబంధం..
వీరిద్దరి జీవితాల్లో సంతోషం ఎంత ఉందో కష్టం, కన్నీళ్లు కూడా సమపాళ్లలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వేదిక మీద బలపడిన వీరి బంధం ఈ క్షణం వరకూ స్నేహపూర్వకంగానే ముందుకు సాగుతోంది. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ గా గెలిపించుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డికి ఎదురైన రాజకీయ పరిణామాలు చూసి వేం నరేందర్ రెడ్డి ఏమాత్రం భయపడలేదు. స్నేహితుడా నేనున్నాను నీకు అండగా అంటూ బుజం తట్టి నిలబడ్డాడు. స్నేహితుడి కష్టాల్లో పాలు పంచుకున్నాడు. స్నేహ ధర్మానికి వందకు వెయ్యి శాతం న్యాయం చేసాడు రేవంత్ రెడ్డి. కష్టాలను కన్నీళ్లను, కేసులను అనుభవిస్తూనే రాజకీయాల్లో వినూత్న అడుగులు వేసారు. తెలుగుదేశం నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారి అంచెలంచెలుగా ఎదిగారు రేవంత్ రెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పీసీసీ అద్యక్షుడిగా, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఐనప్పటికీ స్నేహానికి ఇచ్చే విలువలో ఏమాత్రం తేడా చూపించలేదు సీఎం రేవంత్ రెడ్డి.

ఆనాడు స్నేహితుడిని ఎమ్మెల్సీ చేసుకోలేక పోయాననే కసి, పట్టుదల రోజురోజుకూ ఎవరెస్టు శిఖరంలా పెరిగిపోయింది తప్ప ఏమాత్రం సన్నగిల్ల లేదు. అందుకే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన స్నేహితుడుని రాజ్యసభకు పంపించాలనుకున్నారు. ఖాళీ అవుతున్న రెండు సీట్లలో ఒక సీటును తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలని భావించారు .రాజ్యసభ సీటును ఆశిస్తున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, రాజ్యసభ అభ్యర్ధిత్వానికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ మిత్రధర్మానికి విలువిచ్చారు . అదిష్టానంతో హుందాగా వ్యవహరించి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు.

ఒకప్పుడు ఇదే చట్టసభ సీటు కోసం చేసిన ప్రయత్నాలు ప్రతికూల ఫలితమివ్వగా నేడు అవే ప్రయత్నాలు అందలం ఎక్కించాయి. కాలం వీరులకే సలాం కొడుతుందన్నట్టు రేవంత్ రెడ్డి సాహసానికి, రాజకీయ చతురతకు కాలం జై కొట్టింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఏఐసీసీ పెద్దల చేత శభాష్ అనిపించుకున్న రేవంత్ రెడ్డికి అదిష్టానం పూర్తిస్తాయిలో సహాయ సహకారాలు అందిస్తోంది. ఆనాడు తన మిత్రుడు కేవీపీని రాజ్యసభ సభ్యుడిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కు చాలా సమయం తీసుకుంటే అదే పని రేవంత్ రెడ్డికి కేవలం రెండేళ్లు పట్టింది. అంటే సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉందని స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా గెలిపించుకుని స్నేహం విలువను మరో సారి చాటి చెప్పారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn