తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే జై …

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రెండున్నర యేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఇండియా టుడే , సీ వోటర్ సర్వే తేల్చి చెప్పింది.
ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ఈ సర్వే అంచనా వేసింది. దేశంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వస్తాయని సర్వే పేర్కొన్నది. ఇండియా కూటమి కి మరో సారి ఓటమి తప్పదని తేల్చింది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గత లోక్ సభ ఎన్నికల్లో సాధించిన 8 సీట్లను నిలబెట్టుకోవడంతో పాటు ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. గత లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లు రాగా ఈ సారి కూడా ఫలితం దాదాపుగా అంతేనని తేల్చింది. ఆ పార్టీకి 18 శాతం ఓట్లతో ఒకటి లేదా సున్నా సీట్లు సాధిస్తుందని సర్వేలో పేర్కొన్నారు. బీజేపీ తన 8 సీట్లను నిలబెట్టుకున్నప్పటికి ఓట్లు మాత్రం రెండు శాతం తగ్గాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని సర్వే చెపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కు ఆదరణ పెరుగుతుందని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా రెండున్నర యేళ్లు గడిచిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని అంటుంటారు. కాని రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో ఈ అంచనాలు తప్పు కావడం విశేషం.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన బీఆర్ఎస్ విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికి ప్రజలు పట్టించుకోవడం లేదని సర్వే స్పష్టం చేస్తోంది. దీనికి తోడు ఆ పార్టీ కి కూడా ప్రజల్లో ఆదరణ లభించడం లేదని అంచనాలు చెపుతున్నాయి. అంతర్గత కమ్ములాటలు, కవిత తిరుగుబాటు, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టు గా మారినట్లు అర్థమౌతోంది.
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25 వేల మెజార్టీతో విజయం సాధించారు. అంతకు ముందు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ గెలించింది. తాజా గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 70 శాతం స్థానాలకు కాంగ్రెస్ మద్దతు దారులు గెలిచారు.
