హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా పూర్తి చేశారు.**“లీడర్షిప్ ఇన్ ది 21వ శతాబ్దం”** అనే శీర్షికతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగింది. మైనస్ 15 నుంచి మైనస్ 24 డిగ్రీల తీవ్ర చలి మధ్య ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం విశేషం.ఈరోజు హాజరైన విద్యార్థులకు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఫ్యాకల్టీ సభ్యులు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 62 మంది సభ్యుల బృందం విజయవంతంగా పూర్తిచేశారు.

