నిరాడంబరంగా ఐఎఎస్, ఐపీఎస్ పెళ్ళి

ఇద్దరు తెలుగు సివిల్ సర్వీసెస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణకు ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి పెళ్లి చేసుకున్నారు. చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శేషాద్రిని రెడ్డి ది చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం. శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారు. ప్రస్తుతం ఆయన ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు. శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీ గా పనిచేస్తున్నారు.
