సిట్ ముందుకు కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో కేటీఆర్ ను కోరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇటీవల విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన రెండో సిట్ ట్యాపింగ్ కేసును సవాల్ గా తీసుకుంది. ఇందులో భాగంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులను విచారించింది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించింది. అవసరమైతే మరో సారి పిలుస్తామని సిట్ ఆయనకు స్పష్టం చేసింది. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది.
మరో వైపు సిట్ విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు . కక్ష సాధింపు చర్యలు, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తనను విచారణకు పిలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
