2003 బ్యాచ్ ఈనాడు జర్నలిజం స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పదిలం ఆత్మీయ బంధం
ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లా, ఒక కొమ్మకు పూచిన పువ్వుల్లా ఆత్మీయ బంధాన్ని కాపాడుకుంటూ, మిత్రులంతా కలిసి సంతోషాన్ని పదింతలు చేసుకున్న సందర్భం ఇది. ఈనాడు
జర్నలిజం స్కూల్లో విద్యార్థులుగా చేరి, ఇప్పుడు వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం శంషాబాద్ సమీపంలోని దుగ్గిరాల ఫామ్ హౌజ్ లో ఆదివారం జరిగింది.
ఈనాడు జర్నలిజం స్కూలు -2003 బ్యాచ్ పూర్వ విద్యార్థులైన 40 మంది దీనికి హాజరై తమ అనుభవాలు, విజయాలు, సంతోషాలను స్నేహితులతో పంచుకొని మురిసిపోయారు. ఇరవై రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ స్నేహం అపురూపం, ఆదర్శనీయం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్వో వి.శ్రీనివాసరావు, ఏపీ సమాచారశాఖ కమిషనర్ రెహనాబేగం,
సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, సుకుమార్ రైటింగ్స్ డైరెక్టర్, రచయిత కోగటం వీరా, బీజేపీ నేత సంగప్ప తో పాటు ఈటీవీ, ఈనాడు, టీవీ9, ఎన్ టీవీ, సాక్షి తదితర మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారంతా హాజరయ్యారు. 22 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు గత స్మృతులను నెమరు వేసుకున్నారు. రెహానా, పూడూరి రాజిరెడ్డి రాసిన పుస్తకాలను మహాత్మాకు రెహానా, సంగప్పకు శివ నాగరాజు బహుకరించారు.
