వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. నీటి పంపకాలే ప్రధాన ఎజెండా గా సమావేశాలు కొనసాగనున్నాయి. 29 న అసెంబ్లీ ప్రారంభమై మూడు రోజుల పాటు వాయిదా పడనున్నది. మళ్లీ జనవరి 2 నుంచి సమావేశాలు జరగనున్నాయి. కృష్ణా , గోదావరి జలాల్లో తెలంగాణ వాటా, పెండింగ్ ప్రాజెక్టుల పైన విసృతంగా సభ చర్చించనున్నది. గత పదేళ్లలో జరిగిన పరిణామాలను ప్రభుత్వం సభ ముందు ఉంచనున్నది. బీఆర్ఎస్ పక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సవాల్ విసిరారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రాముఖ్యత పెరిగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో ఈ సారి శీతాకాల సమావేశాలు వేడెక్కనున్నాయి.
