రాసిపెట్టుకోండి.. 2034 జూన్ వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..

రాసిపెట్టుకోండి.. 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్య‌మంత్రి అవుతార‌న్న కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. యేడాదికి ఎన్ని రోజులు ఉంటాయో కూడా కేటీఆర్ కు తెలియ‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో టీడీపీ కి ప‌దేళ్లు, కాంగ్రెస్ కు ప‌దేళ్లు, బీఆర్ఎస్ కు ప‌దేళ్లు అధికారాన్ని ప్ర‌జ‌లు ఇచ్చారని ఇప్పుడు కూడా త‌మ‌కు ప‌దేళ్ల అధికారం ఖాయ‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ప్రెస్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని గ‌త రెండేళ్ల‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.

 

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి.. ఇచ్చిన మాట సోనియా గాంధీ నెరవేర్చేందుకు రాజకీయంగా నష్టపోయినా లెక్కచేయలేదు

ఆనాడు యూపీఏ-1, యూపీఏ-2 లో రైతులు, రైతుల సంక్షేమం కోసం కృషి చేసింది

2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్,
1300 కోట్ల విద్యుత్ బకాయిల మీద మొట్ట మొదటి సంతకం చేశారు

73 వేల కోట్ల రుణమాఫీని మన్మోహన్ సింగ్ అమలు చేశారు

కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు మేలు చేసింది కాంగ్రెస్

జలయజ్ఞం ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేసింది కాంగ్రెస్

కల్వకుర్తి , బీమా, నెట్టెంపాడు, ఆర్డీఎస్, ఇందిరా సాగర్, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు చేపట్టింది కాంగ్రెస్

ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ఇలా చాలా ప్రాజెక్టులు చేపట్టింది

పేదల గుండె చప్పుడు పీజేఆర్ ను మనం గుర్తు చేసుకోవాలి

హైదరాబాద్ లో తాగు నీటి సమస్య వచ్చినపుడు కుండలతో నిరసన తెలిపి, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు

కృష్ణా జలాలను నగరానికి తరలించేలా చేసి జంట నగరాల దాహార్తిని తీర్చారు

హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీగా మారిందంటే ఆనాటి కాంగ్రెస్పాలసీలే కారణం

విద్యుత్ కొరత ఉన్న జంట నగరాలకు నిరంతర విద్యుత్ అందించడం వల్లే దిగ్గజ సంస్థలు నగరానికి తరలి వచ్చాయి

దేశంలో బల్క్ డ్రగ్స్ లో 40 శాతం మన నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి

నగరంలో ఇటీవల ఎలీ లిల్లీ 1 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెడుతోంది

అమెరికన్ ఎయిర్ లైన్స్, మెక్ డొనాల్డ్… ఇలా ప్రపంచంలోని 70 శాతం ఫార్చ్యూన్ 500 కంపెనీలు హైదరాబాద్ లో జీసీసీలు ఏర్పాటు చేసుకున్నాయి

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ గా తయారు కావడం వెనక కాంగ్రెస్ కృషి ఉంది

తెలంగాణలో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోంది

దేశంలోనే పర్ క్యాపిటాలో రంగారెడ్డి జిల్లా ఉంది. ఇందుకు ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే

25 లక్షల అసైన్డ్, 10 లక్షల ఎకరాల పోడు భూములను పంచిన ఘనత ఇందిరమ్మది

దున్నే వాడికే భూమి అనే నినాదాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఘనత పీవీ, ఇందిరా గాంధీలది

జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్ కు మెట్రో వచ్చింది

ఇది చరిత్ర.. ఇది కెసీఆర్ చెరిపేస్తే చెరిగేది కాదు..

ఆనాటి కాంగ్రెస్ పదేళ్ల పాలన, కెసీఆర్ పదేళ్ల పాలనను పోల్చి చూడండి

60 వేల కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే పదేళ్లలో 8 లక్షల 11 వేలకోట్ల అప్పులతో వాళ్లు మాకు అప్పగించారు

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో… పాతాళంలోకి పడిపోయే స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు

వారు కట్టిన కమాండ్ కంట్రోల్, సచివాలయం, ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా..

కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా

కాళేశ్వరం లేకపోయినా మా ప్రభుత్వంలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది

బీఆరెస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా.. కనీసం వీసీలను నియమించలేదు

5 వేల పాఠశాలలు మూసేశారు

పేదలకు విద్య, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు

1 లక్షా 87 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి

ఉస్మానియా ఆసుపత్రిని కట్టలేదు.. టిమ్స్ లు పూర్తి చేయలేదు..

దశ సరిగ్గా లేని వాడి కోసం వాస్తు పేరుతో దిశ మారిస్తే ప్రయోజనం ఉంటుందా

సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన వాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు

ద్రుతరాష్టుడు కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు కెసీఆర్ వ్యవహరిస్తున్నారు..

మా ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశాం

ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాం

రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం

3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం

100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నాం

పాత పథకాలను కొనసాగిస్తున్నాం

రేషన్ కార్డులు, 500 లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం

21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం , తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించాం

కెసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నాం

బీసీకులగణన చేసి కేంద్రం జనగణనతోపాటు కులగణన చేసేలా చేశాం

ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం

హైదరాబాద్ నగరానికి పదేళ్లలో ఒక్క చుక్క అదనంగా తాగునీరు తీసుకొచ్చారా

మేం వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం

మేం వచ్చాక హైదరాబాద్ కు 70 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి

కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాం గా మారారు

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్నారు

కేటీఆర్ ఉండలేక కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు.. సొంత చెల్లి వదిలేసి వెళ్లిపోయింది..

అలాంటి కేటీఆర్ తో కిషన్ రెడ్డికి సావాసమెంది

మేం అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు వేశాం, 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశాం

ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి

ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్..

ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండి

పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తాం.

నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉంది

జూబ్లీహిల్స్ గెలవాల్సిందే అభివృద్ధి జరగాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn