స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ప్రభుత్వం ఆమోదించిన బిల్లును కేంద్రం పెండింగ్ లో పెట్టడంతో జీవో తీసుకువచ్చారు. విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు ఇప్పటికే రాష్ట్ర శాసనసభ బిల్లను ఆమోదించి రాష్ట్రపతికి పంపించింది. అయితే ఇప్పటికీ కేంద్రంపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తు మరో బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ కు పంపింది. అయితే న్యాయసలహా కోసం గవర్నర్ దీన్ని కేంద్ర హోం శాఖ కు పంపించారు. ఆ బిల్లు కూడా పెండింగ్ లో ఉంది. అయితే సెప్టెంబర్ నెలాఖరు లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. మరో రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.