తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడులో విజయవంతమైన స్కీం తమకు ఆదర్శమని ఆయన తెలిపారు. చెన్నై లో జరిగిన విద్యలో తమిళనాడు ముందంజ అనే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమిళనాడు అవలంభిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకిందన్నారు.పేద పిల్లలు అర్థాకలితో పాఠశాలలకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.పేదలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండగా ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణలో ప్రారంభిస్తున్న స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ , ఐటీసీల గురించి సభలో సీఎం వివరించారు.