గ్రూప్ 1 పైన హైకోర్టు కీలక తీర్పు

గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరటనిచ్చింది. సింగిల్ బెంట్ ఇచ్చిన తీర్పుపైన డివిజన్ బెంచ్ స్టే విధించింది. విచారణకు వచ్చేనెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. పేపర్ల రీ వాల్యూవేషన్ వీలుకాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని సూచించింది. దీనిపైన టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ తీర్పుతో గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరట లభించినట్లైంది.