వీర బైరన్ పల్లిగా మార్చండి

సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరన్పల్లి గ్రామాన్ని వీర బైరన్ పల్లి గా మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విజ్ఝప్తి చేశారు. ఎంపీ చామల ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.1947 లో రజాకార్లు ఈ గ్రామంలో ఊచకోత కోశారు. ఏకంగా 126 మంది గ్రామస్తులను హత్య చేశారు. జలియన్ వాలాబాగ్ కంటే ఈ ఘటన భయంకరమైంది. రజాకార్లకు వ్యతిరేకంగా ఈ గ్రామం చేసిన పోరాటానికి గుర్తుగా వీర బైరాన్ పల్లి గా గ్రామానికి పేరు పెట్టాలని ఎంపీ చామల సూచించారు.