తెలంగాణలో కూడా ఒక ట్రంప్..రేవంత్ రెడ్డి

తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉన్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ట్రంప్ ను జనం ఇంటికి పంపించారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరాలకు అవకాశాలు స్రష్టించాలనేది తమ ఆలోచన అని ఆయన అన్నారు. దేశంలో యంగెస్ట్ స్టేట్ తెలంగాణ అని, హైదరాబాద్ కు ఘనమైన చరిత్ర ఉందన్నారు
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించామన్నారు.
తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా విభజించాం,కోర్ అర్బన్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారు…
ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించామని ఆయన తెలిపారు.తెలంగాణలో అభివృద్ధికి తగినట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లు పొడిగించాలని నిర్ణయించామని సీఎం చెప్పారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టమన్నారు. ట్రంప్ ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు.. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారని రేవంత్ రెడ్డి ఎద్దేవా వేశారు.