రైతుల కోసం 2కోట్లు ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్

మిర్యాలగూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. తాను రైతు పక్ష పాతి అని నిరూపించుకున్నారు. తన కొడుకు రిసెప్షన్ కంటే రైతులకు మేలు చేయడమే ముఖ్యమని ఆయన భావించారు. ఏకంగా రైతుల యూరియా కోసం రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబంతో సహా కలిసిన ఎమ్మెల్యే బీఎల్ఆర్ రెండు కోట్ల రూపాయల చెక్ ను అందజేశారు. ఈ డబ్బుతో మిర్యాలగూడ నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కొక్క యూరియా బస్తా ఉచితంగా అందించాలని ఆయన సీఎం ని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా యూరియా బస్తాల పంపిణి జరపాలని ఎమ్మెల్యే బీఎల్ఆర్ ముఖ్యమంత్రికి సూచించారు. బీఎల్ఆర్ కుమారుడు వివాహం ఇటీవల జరిగింది. మిర్యాలగూడా లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి సీఎం ని ఆహ్వానించాలని ఆయన భావించారు. అయితే రిసెప్షన్ కు ఖర్చు పెట్టాలని భావించిన రెండు కోట్ల రూపాయలను రైతులకు అందజేయాలని భావించారు. విశాల హ్రదయాన్ని ప్రదర్శించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.