కేటీఆర్ పైన పోలీసులకు పిర్యాదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గ్రూప్ వన్ పోస్టులను ప్రభుత్వం అమ్ముకుందని ఆయన అసత్య ఆరోపణలు చేశారని కంప్లైయిట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దయాకర్ డిమాండ్ చేశారు. లేకుంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.