కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన బహిరంగసభ వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. ఎన్నికల సమయంలో కామారెడ్డిలో జరిగిన రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ లో స్పష్టం చేశారు. స్థానిక సంస్థలతో విద్యా, ఉద్యోగాల్లో కూడా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావించారు.