ఏసీబీ వలలో పెద్ద చేప

హైదరాబాద్:
ఏసీబీ వలలో పెద్ద చేప పడింది. ఏకంగా నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కింది. నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక 10 లక్షలు లంచం డిమాండ్ చేసింది. అయితే మొదటి విడత గా నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసి ఆమె ను కోర్టు లో హాజరుపర్చారు. మణిహారిక ఆస్తులపైన ఏసీబీ అధికారులు విచారణ జురుపుతున్నారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.