స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల తనకు సెలవు ఇవ్వవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆమె కోరారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు స్మితా సబర్వాల్ కు లీవ్ మంజూరు చేశారు.
కాళేశ్వరం, కంచ గచ్చిబౌలి భూముల కేసుల్లో స్మితా సబర్వాల్ విచారణ ఎదుర్కొంటున్నారు.కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఆమె సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. గత బీఆర్ఎస్ హయాంలో సీఎంవో చక్రం తిప్పిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత లేని పోస్టింగ్స్ లో ఉన్నారు. దీంతో స్మితా సబర్వాల్ అసంత్రుప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియాలో వివరించారు.