సీఎం రేవంత్ రెడ్డి తో రాహుల్ సిప్లిగంజ్, అందె శ్రీ భేటీ

ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన పాడిన పాటకు అస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోటీ రూపాయల నజరానాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాహుల్ సిప్లిగంజ్ ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందె శ్రీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా అందె శ్రీ కి రాష్ట్ర ప్రభుత్వం కోటీ రూపాయల నగదు పురస్కారాన్ని అందజేసింది.