కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వం చేతికి..

కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు షీల్డ్ కవర్ లో నివేదికను పీసీ ఘోష్ అందజేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు విచారణ జరిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది సస్పెన్స్ గా ఉంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ఇంజనీరింగ్ అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.