మూడెకరాల వరకు రైతు భరోసా పూర్తి
1 min read
మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయండి
లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండి
ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం
రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా, గ్రామాల ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు.