బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు
1 min readరైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే, బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు రాకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి 66లక్షల ఎకరాల్లో 1 కోటి 50లక్షల వరి ధాన్యం తెలంగాణ రైతులు పండించారని ఆయన మహబూబ్ నగర్ రైతు సభలో అన్నారు. వరికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండుగ చేసుకుంటున్నారు. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ ను రూ.7500 కోట్లకు తెగనమ్మి ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది11వేల కోట్లేనని, ఈ 11 వేల కోట్లలో రూ. 8596 కోట్లు మిత్తికే పోయాయన్నారు. రైతులకు మీరు చెల్లించింది కేవలం రూ.2500 కోట్లేన్నారు. 25రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండని సీఎం సవాల్ విసిరారు. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమదన్నారు. రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్.. వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్.. రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. ఆనాడు పాలమూరును దత్తత తీసుకుంటా అని కేసీఆర్ అన్నాడు… కానీ పదేళ్ల ఆయన పాలనలో జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు. నా ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడి యువత కోసం కొడంగల్ లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకుంటే..లగచర్ల చిచ్చు పెట్టి అమాయక లంబాడాలను జైల్లో పెట్టించారని ధ్వజమెత్తారు. వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయిండ్రు… నేను ఆనాడే చెప్పిన వాళ్ల మాయ మాటలు నమ్మొద్దన్నారు. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది.