అదానీ 100 కోట్ల విరాళం
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ భారీ విరాళాన్ని అందజేసింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందజేశారు. తెలంగాణ యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం గత కొన్నాళ్లు ఆయన కసరత్తు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పేరున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేతలను ఆహ్వానించి వారు భాగస్వామ్యాన్ని కోరారు. ఇందులో భాగంగానే అదానీ భారీ విరాళంతో ముందుకు వచ్చారు.