కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్ ను ఆశ్రయించిన అమ్రాపాలీ
1 min readతక్షణమే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో నలుగురు ఐఎఎస్ అధికారులు క్యాబ్ ను ఆశ్రయించారు. వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన లు క్యాబ్ లో పిటిషన్లు దాఖలు చేశారు. డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో ఐఏఎస్ లు కోరారు. తెలంగాణలోనే కొనసాగేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ లో వారు కోరారు. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో సృజన పిటిషన్ దాఖలు చేశారు. వేరువేరుగా వీరు నలుగురు ఐఏఎస్ లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ విచారణ జరపనున్నది.