కేటీఆర్ కు లీగల్ నోటీస్

1 min read

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది. అమృత్ టెండర్ల పైన ఆయన చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసులు అందుకున్నారు. కాంట్రాక్టర్ సూదిని సృజన్ రెడ్డి  కేటీఆర్ కు నోటీసులు పంపించారు. అమృత్ టెండర్ల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని  సృజన్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి బంధువు వల్లే టెండర్లు ఇచ్చారంటూ కేటీఆర్ పలు సార్లు మీడియా లో మాట్లాడారు. తన  కంపెనీ శోభ కన్స్ట్రక్షన్ 2010 నుంచి పనిచేస్తుందని సృజన్ రెడ్డి స్పష్టం చేశారు. శోభ కన్స్ట్రక్షన్ కంపెనీ, 2020 నుంచి AIR and IHP లతో కలిసి జాయింట్ వెంచర్ గా పనిచేస్తుందన్నారు. అమృత్ టెండర్లలో భాగంగా 1,110 కోట్ల పనుల తమకు దక్కాయని ఆయన తెలిపారు. ఇందులో శోభ కన్స్ట్రక్షన్ వ్యాల్యూ 29% అని, దాని విలువ 321 కోట్లు మాత్రమేనని సృజన్ రెడ్డి తేల్చి చెప్పారు. సృజన్ రెడ్డి లీగల్ నోటీసులపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn