యూట్యూబర్ హర్ష సాయి పైన ఫిర్యాదు
1 min readయూట్యూబర్ హర్ష సాయి పైన ఓ యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేసింది. తన వద్ద రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. హర్ష సాయి తండ్రి పైన కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమకు చెందిన వారిపై ఇలాంటి ఫిర్యాదు రావడం ఈ వారంలో ఇది రెండోది కావడం విశేషం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.