ఆ ఫామ్ హౌస్ లీజ్ కు తీసుకున్న
1 min readజన్వాడలోని ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తన మిత్రుడి నుంచి లీజ్ కు తీసుకున్నానని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్దంగా ఉంటే కూల్చివేసుకోవచ్చునని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రోజే రూ. 2 లక్షల రుణమాఫీ అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ బూటకం, పచ్చి దగా, పచ్చి మోసమని ఆయన ఆరోపించారు. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి బండారం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బట్ట బయలైందన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంది కానీ జరిగింది మోసం. రుణమాఫీ జరగలేదు.మాకెందుకు రుణమాఫీ జరగలేదని రైతుల రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. రుణమాఫీ కాలేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా రణరంగంగా మారిందన్నారు. అదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం లో బజార్ హత్నూర్ లో రైతుల పై కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే రైతులకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కేసులు పెట్టి వేధిస్తుంది ఈ ప్రభుత్వం రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుందన్నారు.