సీతారామ ప్రాజెక్ట్ ఘనత మాదే

1 min read

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మార్చేందుకు ఉద్దేశించ బడిన రాజీవ్,ఇందిరా సాగర్ లే నేటి సీతారామ ప్రాజెక్ట్ అని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,రెవిన్యూ మరియు సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు స్పష్టం చేశారు.అటువంటి నీటి పారుదల రంగాన్ని ఇదేండ్లు నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్న హరీశ్ రావు ఆ తరువాత ఇదేండ్లు అదే శాఖాను పర్యవేక్షించిన తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు భ్రష్టు పట్టించింది చాలక ఇప్పుడు హరీష్ రావు గ్లోబెల్ ప్రచారంతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు తాపత్రయ పడుతున్నరని వారు మంది పడ్డారు.హారిష్ రావు ప్రకటన చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవాచేశారు..మీ ప్రభుత్వం పదేళ్ళలో 1.81 కోట్లు ఖర్చు పెట్టినా సాధించిన ఫలితం శూన్యమని వారు దుయ్యబట్టారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు ఖర్చు చేసి కుడా లక్ష ఎకరాల ఆయకట్టును కొత్తగా సేద్యంలోకి తీసుక రాలేక పోయారని వారు విమర్శించారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు బి ఆర్ యస్ ప్రభుత్వానికి పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు గుర్తుకు రాలేదని వారు నిలదీశారు.యస్.ఎల్.బి సి,డిండి,నెట్టెంపాడు,భీమా,కల్వకుర్తి,కోయిలసాగర్ ,పాలమూరు ఎత్తి పోతాల పధకాలు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు.

కేవలం 3505 కోట్లతో కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన రాజీవ్,ఇందిర సాగర్ ప్రాజెక్ట్ పూర్తి కావలసి ఉండగా కమిషన్ లకు కక్కుర్తి పడిన బి ఆర్ యస్ సర్కార్ సీతారామ ప్రాజెక్ట్ గా పేరు మార్చి రీ-డిజైనింగ్ పేరుతో ఆ మొత్తాన్ని ఏకంగా 18,286 కోట్లకు పెంచింది వారు ఆరోపించారు. నాటి ప్రతిపాదనల ప్రకారాం కేవలం 349 మేఘా వాట్ల విద్యుత్ సరిపోతుండగా మామా అల్లుళ్ళ నిర్వాకంతో ఇప్పుడు రెట్టింపు అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లో ఉండగా 2016 లో 7,926 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వమే దిగిపోయే నాటికి రీ-డిజైన్ పేరుతో 19 వేల కోట్లకు చేరడం వెనుక ఉన్న మతలబు కమిషన్ లకు కక్కుర్తి పడడమేనని మంత్రులు ఉత్తమ్,పొంగులేటి లు ఆరోపించారు. సీతారామ ప్రాజెక్ట్ లకు సి డబ్ల్యూ సి అనుమతులు ఉన్నాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్న మాటలు సత్యదూరంగ ఉన్నాయన్నారు మేమే తెచ్చామంటూ బి ఆర్ యస్ నేత హారిష్ రావు మాటల్లో నిజమే లేదంటూ తాజాగా సి డబ్ల్యూ సి చేసిన ప్రకటనను వారు ఉదహరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోనీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతోటే అనుమతులు తుది దశకు చేరుకున్నాయని వారు వెల్లడించారు. మేము చేసిన కృషితోటే 65 టి యం సి ల నీటి కేటాయంపులు సీతారామ ప్రాజెక్ట్ కు రబోతున్నాయన్నారు.సీతారామ ప్రాజెక్ట్ పనులు బి ఆర్ యస్ ప్రభుత్వ హయాంలో జరిగింది కేవలం 39 శాతం మాత్రమే నన్నారు.ఇప్పుడేమో అదంతా మా గొప్ప తనమే నంటూ గొప్పలు చెప్పుకుంటున్న బి ఆర్ యస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగా ఎకరాకు నీళ్లు ఎందుకు పారించ లేక పోయారని మంత్రులు ఉత్తమ్,పొంగులేటి లు సూటిగా హరీష్ రావును ప్రశ్నించారు.ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 87 కోట్లు ఖర్చు పెట్టి 16,000 వేల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడంతో పాటు లక్షా పదివేల ఎకరాలకు సాగునీటిని స్టీరికరించ బోతున్నామన్నారు.నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్న6 గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించి ఖమ్మం జిల్లాకు సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సంకల్పం అని వారు పేర్కొ5.డబ్బు ఎక్కడ మిగులుతోందో అక్కడ మాత్రమే పనులు చేసిన చరిత్ర బి ఆర్ యస్ ప్రభుత్వానిదని వారు విమర్శించారు.ఇప్పటికైనా గ్లోబెల్ ప్రచారం మానుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు హరీష్ రావుకు హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn