ఎన్నో అవమానాలు పడ్డా
1 min read45 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక అవమానాలు పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరారావు అన్నారు.శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయవల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేయడానికి ప్రయత్నించానన్నారు. ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నా.. ఆ జలాలు ఈ నేలను తడపలేదని తుమ్మల అన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్న ప్రతిసారి సీఎంలతో మాట్లాడి నా ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకుండానే భారాస నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారాస పాలనలో రుణమాఫీ కాని రైతుల సంఖ్య గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణాఫీకి ఇప్పటికే రూ.31 వేల కోట్ల నిధులు కేటాయించామని, అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని తుమ్మల తేల్చి చెప్పారు.